andhrapradesh
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు మహిమలు!
- ఇద్దరు మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, తాజా బోర్డ్ చైర్మన్ సతీమణి కి కార్పొరేటర్ గా అవకాశం
విశాఖపట్నం, సూర్య: వన్ టౌన్ బురుజుపేటలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు మహిమలు నేటికీ భక్తజనం ముందు కనువిందు చేస్తున్నాయి. భక్తితో కొలిచే భక్తులతో పాటు అమ్మవారికి సేవలందించిన వారిపైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి కరుణాకటాక్షాలు ఎప్పుడూ ఉంటాయని మరో మారు అమ్మవారు చాటిచెప్పారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పాలకమండలి చైర్మన్లుగా సేవలు అందించిన జెర్రిపోతుల ప్రసాద్, కొల్లి సింహాచలం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కనకమాలక్ష్మి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కందుల నాగరాజు సతీమణి నళ్ళని మహావిశాఖ నగరపాలక సంస్థ కార్పొరేటర్లుగా అమ్మవారి దయతో విజయం సాధించడం కనకమాలక్ష్మి అమ్మవారి మహిమ వల్లే అంటూ వన్ టౌన్ ప్రాంత వాసులు కొనియాడుతున్నారు. దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఇద్దరూ మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తాజా చైర్మన్ సతీమణి కి అమ్మవారు మహిమ వల్లే కార్పొరేటర్లుగా విజయం దక్కిందన్నది స్థానికంగా మారింది. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు మహిమలు ఇటీవల కాలంలో భక్తుల భక్తులం ముందు పడుతున్నాయని బురుజుపేట స్థానిక ప్రాంత ప్రజానీకం అమ్మవారి భక్తులు అభిప్రాయపడుతున్నారు. అమ్మవారి కళ్ళుగప్పి తప్పు చేయాలని చూస్తే అమ్మవారు తీరుతుందని ఇటీవల దేవస్థానంలో జరిగిన కొన్ని సంఘటనలే ప్రధానంగా దేవస్థానం ఉద్యోగులతో పాటు అమ్మవారి భక్తులు ప్రజానీకం కథలుగా చెప్పుకుంటున్నారు. విశాఖ నగర వాసులకు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు ఎల్లవేళలా కాపాడుతుందని అమ్మవారి పాత తరo పెద్దలు గుర్తు చేసుకుంటున్నారు.