నాగుల చవితి వేడుకల్లో నల్లమరమ్మ తల్లీ పుట్ట నీ దర్శించుకున్న జీవీఎంసీ 5 వ వార్డు కార్పొరేటర్
భీమిలి, సూర్య: నవంబర్ 13 మేజర్ న్యూస్ :నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ 5 వ వార్డు పరిధిలోని చొక్కావని పాలెం గ్రామంలో శ్రీ నల్ల మారమ్మ దేవాలయాల్లో నిర్వహించిన నాగుల చవితి వేడుకల్లో జీవీఎంసీ 5 వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి చోడీపల్లి గాయత్రి శంకర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లమరమ్మ తల్లీ ఆశీస్సులు 5 వ వార్డు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.అలాగే 5 వ వార్డు ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. అదే విధంగా అన్నీ గ్రామాల నుండి భక్తులు తరలి రావడంతో నల్లమరమ్మ పూట్ట దగ్గర పండగ సందడి వాతావరణం ఏర్పడింది ఈ కార్యక్రమంలో 5 వ వార్డు టిడిపి నాయకులు గరికిన కింగ్, కారి అప్పారావు, జనసేన వార్డు ఇంచార్జీ గరికిన అప్పారావు పాల్గొన్నారు