BREAKING
ధనుష్, మారి సెల్వరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ మార్పు.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్! ఆర్కేలో ఘనంగా బాలల దినోత్సవం నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు : డాక్టర్ తాతిరెడ్డి రామకృష్ణారెడ్డి కాశీబుగ్గలో అగ్నిప్రమాదం - గడ్డికుప్ప బూడిద. వస్తువులు అడిగి పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగుడు పంచాయతీ ఎన్నికల బరిలో దొమ్మేటి వినోద్ కుమార్ అధిక సాంద్రత పద్ధతితో అధిక దిగుబడి. • కోటపల్లి ఏమ్ఏఓ సాయి కృష్ణ. బొడ్డపాడు రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత. దివ్యాంగలకు శాప్ స్పోర్ట్స్ పాలసీలో గుర్తింపు ఇవ్వాలి హైదరాబాద్‌క రాహుల్ గాంధీ పర్యటన.. రేప గిగ్ వర్కర్లతో భారీ ర్యాలీ, సంక్షేమ పథకాల ప్రారంభం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కృషి ఫలితం.. రెండు చెరువుల పునరుద్ధరణకు రూ.3.32 కోట్ల నిధులు మంజూరు అనపర్తి మండలంలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు. ప్రజలకు మెరుగైన డిజిటల్ వైద్య సేవలే లక్ష్యం.. వికారాబాద్‌లో బీసీసీఐ అండర్‌-19 మహిళా క్రికెటర్‌ నందిని ఆత్మహత్య.. ప్రేమ వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణలు ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ ప్రారంభం -విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు -నాయకత్వ లక్షణాలతో పాటు మానసిక వికాసానికి దోహదం : శాప్ చైర్మన్ రవి నాయుడు రావులపాలెం మండలంలో వైఎస్సార్‌సీపీ పరిస్థితి అయోమయం! సంపాదించుకున్న నాయకులు సైడ్‌.. కార్యకర్తల్లో సందిగ్ధం!

పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామి దర్శనం

Select Suryaa Now
పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామి దర్శనం

తిరుమల మేజర్ న్యూస్,

నాగుల చవితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శుక్రవారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై భ‌క్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 7 గంట‌ల నుండి స్వామి, అమ్మ‌వార్లు తిరుమాడ వీధుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌గా పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు.ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో క‌లిసి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని సాక్షాత్కరింపజేస్తున్నాడు. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చాడు.ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో డాక్టర్ శరత్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, వీజీవో సురేంద్ర, పేష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

తిరుమల రిపోర్టర్

టీ. వెంకటారాజ్