BREAKING
భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు స్థలాలు కోల్పోయిన బాధితులకు ఎమ్యెల్యే ఆర్ధిక సహాయం మాజీ మంత్రి శ్రీ శత్రుచర్ల విజయరామరాజు గారు కన్నుమూత పూతలపట్టులో యస్ ఏ ఏ యన్ యస్ కార్యక్రమం ప్రారంభం – చిన్న పిల్లల్లో న్యూమోనియా నివారణే లక్ష్యం 24 గంటల్లో ప్రజా సమస్యకు పరిష్కారం! రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఈనాడు లక్ష్య విద్యార్థుల ఎంపిక సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ నెల్లూరు జిల్లాలో స్థానిక సమరం.. పల్లెపల్లెనా రాజకీయ వేడి! మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం : రూ. 1,57,607 కోట్ల విలువైన 35 అవగాహనా ఒప్పందాలు జనగణనను సమర్థవంతంగా పూర్తి చేయాలి: కమిషనర్ చల్లా ఓబులేసు రాళ్ల రోడ్డుపై విద్యార్థుల నరకయాతన మొక్కుబడిగా మండల సర్వసభ్య సమావేశం న్యుమోనియా నివారణతోనే బాల్యానికి భరోసా - డా. మానస మగ్దుంపల్లి గ్రామంలో రీ సర్వే 22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి

*ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి*.. *సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ

Select Suryaa Now
*ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి*..  *సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ

 

నెలవారీ పోలీసు అధికారుల సమీక్షా సమావేశంలో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ నరసింహ పోలీసు అధికారుల నెలవారీ సమీక్షలో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో  సూర్యాపేట డివిజన్ పరిధి పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల దర్యాప్తులో నాణ్యత, పెండింగ్ కేసుల పరిష్కారం, ఎన్‌బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజా భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన తీవ్రమైన, అతి తీవ్రమైన, మిస్సింగ్, ఎన్‌బీడబ్ల్యూ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసుల ఛేదన, నాన్‌ బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసుల్లో శాస్త్రీయ ఆధారాలను సేకరించి, నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టాలన్నారు. నేరస్తులకు న్యాయస్థానంలో శిక్ష పడినప్పుడే పోలీసులపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. దర్యాప్తు సమయంలో ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికత, రాష్ట్ర పోలీసు శాఖ అందించిన టూల్స్ సద్వినియోగం చేసుకుని కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేస్తూ,నిందితులను శిక్షలు పడేలా పని చేయాలని ఆదేశించారు.

*పిఎం రహత్ పథకాన్ని  సద్వినియోగం చేసుకోవాలి*..

రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రహత్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పథకం కింద సూర్యాపేట జిల్లాలో 38 ఆసుపత్రులను గుర్తించారు, ప్రమాద బాధితులకు ఉచిత అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ప్రమాద సూచిక బోర్డులు, సీసీ కెమెరాల ఏర్పాటు చేయించాలని అన్నారు. ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రతి గ్రామంలోని ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలతో పాటు ప్రార్థనా స్థలాలు, పరిశ్రమలు, ధాబాలు, పెట్రోల్ బంకులు తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు.

*పోలీసు వాహనాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి*..

పోలీస్ అధికారులకు కేటాయించిన పోలీసు వాహనాలను తనిఖీ చేసిన నిర్వహణ, పనితీరును పరిశీలించారు. ప్రతి వాహనానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించి, అత్యవసర సమయాల్లో తక్షణమే వినియోగించుకునేలా సిద్ధంగా ఉంచాలని డ్రైవర్లను ఆదేశించారు. విధి నిర్వహణకు అవసరమైన కమ్యూనికేషన్ సెట్, ఎమర్జెన్సీ కిట్లు వాహనాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి,డియస్పి లు సత్యయ్య, ప్రసన్న కుమార్, సైబర్ సెక్యూరిటీ సెల్ డిఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ శివ కుమార్, డిసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ మగ్దుం అలి, జిల్లా ఇన్‌స్పెక్టర్లు నాగేశ్వరరావు, వెంకటయ్య, ఉపేందర్ రావు, రాజశేఖర్, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.