BREAKING
వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ధ్వంసం దుర్మార్గమైన చర్య, దోషులను కఠినంగా శిక్షించాలి ఇంటెసా సాన్‌పాలో మోంటే డీ పాస్చి డెయి సియెనా బ్రాండ్ పేరు యథావిధిగా కొనసాగింపు భూముల రీ సర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఫస్ట్ అబూధాబి బ్యాంక్ భారీ రైట్స్ ఇష్యూ రోప్స్ సంస్థ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సింగిల్ విండోసొసైటీ రైతులకు ఈకేవైసి తప్పనిసరి.* *అధ్యక్షులు చిత్రలింగప్ప*   మిడ్లైన్ టెస్ట్ ఆన్లైన్ పరీక్షల తీరును పరిశీలించిన ఎఫ్ఎల్ ఎన్ సభ్యులు లాల్ సింగ్ జనసేన జయరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీటీసీ లాల్ స్వామి అమెరికా ఆర్థిక ధోరణులతో ప్రపంచ ఈక్విటీలపై ప్రభావం ఘనంగా శివపంచాయతన ఆంజనేయ స్వామి ఆలయ ఉత్సవాలు పోతుదొడ్డి సర్పంచ్ బరిలో టీడీపీ అభ్యర్థిగా జిట్టా కదిరప్ప జీవనజ్యోతి బీమా' చెక్కుల పంపిణీ ​ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేత బిగ్ టెక్ డిజిటల్ మోసాలకు చెక్ పెడుతూ కఠిన నిబంధనలు భూముల రీసర్వేను వేగవంతం చేయాలి - కలెక్టర్ ఇలా త్రిపాఠి

తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలి

Select Suryaa Now
తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలి
సూర్య మాక్లూర్ : మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులకు వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూసార పరిరక్షణ, ఎల్‌నినో ప్రభావం, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు వివరించారు.వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయలు తదితర తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవాలని తెలిపారు. దీనివల్ల పెట్టుబడి నష్టాలను తగ్గించుకోవడంతో పాటు రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు.అలాగే భూసారాన్ని కాపాడేందుకు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భరత్,ఉపసర్పంచ్ హన్మండ్ల,మండల వ్యవసాయ అధికారిని పద్మ,కార్యదర్శి సాగర్,వ్యవసాయ విస్తీర్ణ అధికారి నరేష్,రైతులు శ్రీనివాస్,మురళి,సాయిబాబా,గాంధీ,రామ్మోహన్,తదితరులు పాల్గొన్నారు.