పీయు విద్యార్థిని మాధురికి పీ హెచ్డీ ప్రదానం
పాలమూరు యూనివర్సిటీ,మేజర్ న్యూస్ -
-పాలమూరు విశ్వవిద్యాలయం మైక్రోబయాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. శాంతిప్రియ అజ్మీరా పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థిని పి. మాధురి మైక్రోబయాలజీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఎక్స్ప్లొరేషన్ ఆఫ్ థెర్మొఫిలిక్ కొప్రొఫిలౌసీ ఫంగీ ఫ్రమ్ హెర్బివోర్ డంగ్ అండ్ థేర్ బయ్యాక్టివ్ పొటెన్షియల్ అనే అంశంపై ఆమె పరిశోధన నిర్వహించారు.
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ గురువారం మాట్లాడుతూ, విశ్వవిద్యాలయ పరిశోధనలు సమాజానికి ఉపయోగపడాలని, సూక్ష్మజీవులు, శిలీంధ్రాల్లోని ఔషధ గుణాల అన్వేషణ వైద్య, ఔషధ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుందని అన్నారు. పి. మాధురి పరిశోధన అభినందనీయమని పేర్కొన్నారు.
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు మాట్లాడుతూ, నాణ్యమైన పరిశోధనలు సమాజ అభివృద్ధికి, శాస్త్రీయ ఆవిష్కరణలకు దోహదపడాలని ఆకాంక్షించారు.
ఈ పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం మైక్రోబయాలజీ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ సందీప్త బుర్గుల బాహ్య పరీక్షకులుగా వ్యవహరించారు.ఈ పరిశోధనలో శాకాహార జంతువుల పేడ నుంచి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే శిలీంధ్రాలను వేరుచేసి, వాటిలోని జీవక్రియాశీల సమ్మేళనాలను అధ్యయనం చేశారు. ముఖ్యంగా మలేరియా నిరోధక, యాంటీఆక్సిడెంట్, క్యాన్సర్ పరిశోధనలకు ఉపయోగపడే లక్షణాలను పరిశీలించారు. ఆమె పరిశోధనా పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ శాస్త్రీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.
ఆమె రత్నకుమారి, నర్సింహారావు దంపతుల కుమార్తె. పదో తరగతిని గురునానక్ హైస్కూల్‌లో, ఇంటర్మీడియట్‌ను సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాలలో, డిగ్రీని సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో, పీజీని శ్రీ వాణి ఉమెన్స్ కాలేజ్, హైదరాబాద్ లో పూర్తి చేశారు.
2016 లో నెట్ లో అర్హత సాధించి, పీ యూ లో పీహెచ్డీ అడ్మిషన్ పొందారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ & హెడ్ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి,ప్రొఫెసర్ పిండి పవన్ కుమార్, ప్రొఫెసర్ కిషోర్, డా. మృదుల, డా. వాసవి తదితరులు పాల్గొన్నారు.
ఎం.ఓం ప్రకాష్ పాలమూరు యూనివర్సిటీ,మహబూబ్ నగర్ ..