BREAKING
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. జార్ఖండ్ జట్టు ప్రకటన, ఇషాన్‌ కిషన్‌కు దక్కని చోటు! మహిళా వర్సిటీలో విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్ శభాష్ చంద్ర..! జనగణనను పకడ్బందీగా నిర్వహించండి లైఫ్‌సైన్సెస్ రంగంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు.. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.. లైఫ్‌సైన్సెస్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మధ్య ఒప్పందం ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి కే-రిడ్జ్ స్కూల్‌లో ఘనంగా ఎన్‌సీసీ యూనిట్ ప్రారంభోత్సవం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘హైందవ’ నుంచి మెస్మరైజింగ్ రొమాంటిక్ మెలోడీ ‘ఎవరైనా’ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! గ్రంథాలయాలు విజ్ఞానాలయాలు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి : ఇంకొల్లు సి.ఐ రామ్‌ నాయక్‌ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సిపిఎస్ నుంచి ఓపిఎస్ కు అవకాశం డిసెంబర్ 31 లోపు నిధి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి : డిఇఓ వైఎస్ జగన్‌ను కలిసిన చవ్వా రాజశేఖర్ రెడ్డి *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు*

తిరుపతిలో సెమీ కండక్టర్స్ పార్క్ అభివృద్ధికి సైయంట్ సుముఖత : సైయంట్ ప్రెసిడెంట్ నరసింహంతో మంత్రి నారా లోకేష్ సమావేశం

Select Suryaa Now
తిరుపతిలో సెమీ కండక్టర్స్ పార్క్ అభివృద్ధికి సైయంట్ సుముఖత :  సైయంట్ ప్రెసిడెంట్ నరసింహంతో మంత్రి నారా లోకేష్ సమావేశం

విశాఖపట్నం, మేజర్‌న్యూస్‌ :

 సైయంట్ ప్రెసిడెంట్ & హెడ్ ఆఫ్ కార్పోరేట్ ఫంక్షన్స్ డాక్టర్ పీఎన్ఎస్వీ నరసింహంతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... తిరుపతిలో సెమికండక్టర్ పార్క్ అభివృద్ధికి జాయింట్ డెవలప్ మెంట్ మోడల్ ను పరిశీలించాలని కోరారు. సుమారు 200 ఎకరాల్లో సెమికాన్ పార్కు అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. సైయంట్ ఫౌండేషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) మధ్య గత ఏడాది జూన్ లో కుదిరిన ఎంవోయూ, తదనంతర పురోగతిపై చర్చించారు. సైయంట్ ప్రెసిడెంట్ నరసింహం మాట్లాడుతూ... ప్రస్తుతం విశాఖపట్నం (రుషికొండ), కాకినాడలలో సైయంట్ లిమిటెడ్ ఐటీ, ఇంజనీరింగ్ ఎస్ఈజెడ్ క్యాంపస్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు. జూన్ 2025లో అమరావతిలో కుదిరిన ఒప్పందం మేరకు విశాఖపట్నంలో సిటీ ఇన్నోవేషన్ క్లస్టర్ ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చెప్పారు. పైలట్ క్లస్టర్ లో 43 ఉన్నత విద్యా సంస్థలు, 270కు పైగా పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. జాయింట్ డెవలప్ మెంట్ మోడల్ లో తిరుపతిలో సెమికాన్ పార్క్ అభివృద్ధికి నరసింహం సుముఖత వ్యక్తం చేశారు.