BREAKING
సేంద్రీయ సాగును ప్రోత్సహిద్దాం.. చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలు ప్రారంభం అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వర్షిత్‌కు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కలిసికట్టుగా పని చేద్దాం సర్పంచ్ ఎన్నికల్లో గెలుద్దాం ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి సభకు సిద్దిపేటలో ఏర్పాట్లు షురూ! బ్రహ్మాసముద్రం మండలం,ఎరిడికేరా సర్పంచ్ అభ్యర్థి గా గాజుల కుమార్ ఎన్నిక. పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు శ్రీ కాళహస్తి మున్సిపాలిటీ చైర్మన్ కొరకు సర్వే కూరగాయల సాగుతో అదనపు ఆదాయం ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కూటమి విజయంతో రాష్ట్రానికి ఆదర్శం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్యానంతో మానసిక ప్రశాంతత.. అహింసా జగత్‌ పిరమిడ్‌ ధ్యాన ఆశ్రమం ప్రారంభం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మంటలు

జిల్లాలో ఎల్ నినో గ్రామసభలు సమర్థవంతంగా నిర్వహించాలి. అదనపు కలెక్టర్ నగేష్

Select Suryaa Now
జిల్లాలో ఎల్ నినో గ్రామసభలు సమర్థవంతంగా నిర్వహించాలి. అదనపు కలెక్టర్ నగేష్

మెదక్ ; జిల్లాలో ఎల్ నినో గ్రామసభలు సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు  కలెక్టర్ నగేష్ అధికారులను, ఎంపీడీవోలను ఆదేశించారు. 
గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా గ్రామీణ అభివృద్ధి, పంచాయితీ, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ , పంచాయతీరాజ్ జిల్లా సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ఎంపీడీవోలతో ఎల్ నినో గ్రామసభలు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి, జలసిరి పనులు, అంగన్వాడి బిల్డింగ్స్ నిర్మాణం, తదితర అంశాలపై గూగుల్ మీట్ నిర్వహించారు. ముందుగా ఎల్ నినో 
గ్రామసభల నిర్వహణ తీరుపై వివిధ మండలాల ఎంపీడీవోల వారిగా రివ్యూ నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్ నినో గ్రామసభలు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.జలసిరి పనులకు సంబంధించి కొన్ని మండలాల్లో  కొత్త పనుల ప్రారంభం, గ్రౌండింగ్, పూర్తిలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని  అసంతృప్తి వ్యక్తం చేశారు.  మంజూరైన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ సోక్‌పిట్స్ నిర్మాణంలో కూడా  పురోగతి పెంచాలన్నారు. . వచ్చే వారం నాటికి నిర్దేశించిన లక్ష్యాలకు , మంజూరైన పనులన్నీ ప్రారంభించి పురోగతి సాధించాలని ఆదేశించారు.గ్రామసభలు నిర్వహించేటప్పుడు ప్రతి శాఖ యాక్టివిటీ గురించి తప్పనిసరిగా చర్చించాలన్నారు. జిల్లా విద్యాశాఖ  తరఫున పాఠశాలల్లో ఎల్ నినో అంశంపై విద్యార్థులతో మాట్లాడించాలన్నారు.
ప్రతి మండలం వ్యక్తిగత  ఇంకుడు గుంతల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, డిపిఓ యాదయ్య, మిషన్ భగీరథ  సంపత్ కుమార్, డి ఎల్ పి ఓ లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు