జనసేన జయరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీటీసీ లాల్ స్వామి
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:-అనంతపురం రూరల్ మండలం నారాయణపురం పంచాయతీ ఎంపీటీసీ-2గా విజయం సాధించిన జనసేన నాయకుడు లాల్ స్వామి, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కుంటిమద్ది జయరాం రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జయరాం రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో నారాయణపురం ఎంపీటీసీ 2 స్థానం నుండి విజయం సాధించిన లాల్ స్వామిని ప్రత్యేకంగా అభినందించారు. జనసేన సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వల్లంశెట్టి రమణ, జక్కిరెడ్డి ఆదినారాయణ, లక్ష్మన్న, భోజల ఆంజనేయులు, పెండాల చిరు, ప్రసాద్, కృష్ణ, నారాయణ, అనసూయ, తిరుమలమ్మతో పాటు నారాయణపురం యువజన నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ బలోపేతానికి ఐకమత్యంతో కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..