BREAKING
భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు స్థలాలు కోల్పోయిన బాధితులకు ఎమ్యెల్యే ఆర్ధిక సహాయం మాజీ మంత్రి శ్రీ శత్రుచర్ల విజయరామరాజు గారు కన్నుమూత పూతలపట్టులో యస్ ఏ ఏ యన్ యస్ కార్యక్రమం ప్రారంభం – చిన్న పిల్లల్లో న్యూమోనియా నివారణే లక్ష్యం 24 గంటల్లో ప్రజా సమస్యకు పరిష్కారం! రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఈనాడు లక్ష్య విద్యార్థుల ఎంపిక సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ నెల్లూరు జిల్లాలో స్థానిక సమరం.. పల్లెపల్లెనా రాజకీయ వేడి! మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం : రూ. 1,57,607 కోట్ల విలువైన 35 అవగాహనా ఒప్పందాలు జనగణనను సమర్థవంతంగా పూర్తి చేయాలి: కమిషనర్ చల్లా ఓబులేసు రాళ్ల రోడ్డుపై విద్యార్థుల నరకయాతన మొక్కుబడిగా మండల సర్వసభ్య సమావేశం న్యుమోనియా నివారణతోనే బాల్యానికి భరోసా - డా. మానస మగ్దుంపల్లి గ్రామంలో రీ సర్వే 22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి

రోప్స్ సంస్థ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు

Select Suryaa Now
రోప్స్ సంస్థ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు

గిరిజన కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో రోప్స్ సంస్థ వారు కుప్పం పివిఎస్ ఆసుపత్రి వారి  సహకారంతో దేవలంపేట, దొడ్డిపల్లి, తిమ్మయ్యగారిపల్లి గ్రామాల్లోని యానాది కాలనీలలో  ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి389 మందికి వైద్య సేవలు అందించారు.గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు రావడం, వివిధ ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, పిల్లలు, యువత, మహిళలు మరియు వృద్దులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో పి ఎస్ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది సహకారంతో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు, చికిత్స అందించి మందులు పంపిణీ చేశారు. ప్రత్యేకించి గిరిజన కుటుంబాల్లో మహిళలు, పిల్లలు, వృద్ధుల ఆరోగ్య అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి తదుపరి వైద్య పరీక్షలు, చికిత్స కోసం తగిన సూచనలు, సిఫార్సులు చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయడంలో పిఇఎస్ ఆసుపత్రి సహకారం కీలకమని, ఈ మూడు రోజుల వైద్య శిబిరాలలో 389 మంది యానాది గిరిజనులు వైద్య పరీక్షలు చేయించు కున్నారని రోప్స్  సంస్థ ప్రొగ్రాం మేనేజర్ డాక్టర్  పౌలు రాజ్  పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా గిరిజన కుటుంబాల ఆరోగ్య స్థితిగతులనుమెరుగు పరచడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయనున్నట్లు పిఈఎస్ కమ్యూనిటీ మెడిసిన్  శాఖాధిపతి తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 45 మంది స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొన్నారు. రో ప్స్ సంస్థ తరపున ప్రొగ్రాం ఆఫీసర్లు, ఆయా గ్రామాల కమ్యూనిటీ ఎడ్యుకేటర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి, రిపోర్టర్ పెద్దపంజాణి