అర్హులైన బాలికలందరికి హెచ్పివి టీకాల అందజేత
సూర్య- బిక్కనూర్ : భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం అందజేస్తున్న హెచ్ పి వి వ్యాక్సిన్ మండలంలో పకడ్బందీగా అందజేస్తున్నామని మండల వైద్యాధికారి హేమీమా చెప్పారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మరియు పట్టణంలోని చైతన్య ఉన్నత పాఠశాలలో 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్ పి వి వ్యాక్సియేషన్ అందజేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి సహకారం అందిస్తున్న బాలికల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ జానకి, ఎం పి హెచ్ ఎ సావిత్రి, ఆశా కార్యకర్తలు స్వప్న, సంతోషి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.