BREAKING
ఎండపల్లి పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తికి 8810 ధర అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా పబ్లిక్ టాయిలెట్లు ఎర్రావారిపాలెం మండలంలో టీడీపీకి షాక్‌..! తూప్రాన్ గీత స్కూల్లో చాచాజీ ఆకారంలో విద్యార్థులు ఎండపల్లి రహదారుల అభివృద్ధికి రూ.55 లక్షలు మంజూరు చేయాలి రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* *రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి* భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్ రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో త్రిగుణ్.. టెర్రిఫిక్ యాక్షన్‌తో జంగా గ్లింప్స్ విడుదల! *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* నారాయణఖేడ్ మేజర్ న్యూస్ నారాయణఖేడ్ పట్టణం నుండి ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన గనుగాపూర్‌కు నిర్వహించే మహా పాదయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం పెద

వైసీపీ క్యాడర్ పోలేదు.. జగ్గిరెడ్డి బలం తగ్గలేదు

Select Suryaa Now
వైసీపీ క్యాడర్ పోలేదు.. జగ్గిరెడ్డి బలం తగ్గలేదు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలపై చిర్ల వ్యాఖ్యలు.. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా

రావులపాలెం: మేజర్ న్యూస్ :ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనంత మాత్రాన వైఎస్సార్‌సీపీ ప్రజాబలం తగ్గిపోయిందని భావించరాదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నాయకుడు చిర్ల జగ్గిరెడ్డి అభిప్రాయపడుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వైసీపీ క్యాడర్ ఎక్కడికీ పోలేదని, తన బలం కూడా తగ్గలేదని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీలోని కొందరు కోవర్టులు టీడీపీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీకి చెందిన మాజీ జడ్పీటీసీ ఒకరు సైతం పరోక్షంగా టీడీపీకి సహకరించారనే ఆరోపణలు తో కూడిన విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 
మరోవైపు ఎన్నికల్లో గెలిచిన ఐదు ఎంపీటీసీ స్థానాల్లో మెజారిటీలు స్వల్పంగానే ఉండగా, మరో స్థానంలో మాత్రమే కొంత ఎక్కువ గా మెజారిటీ నమోదైందని వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో రావులపాలెం మండలం కూటమికి 10 వేలకుపైగా మెజారిటీ లభించగా, తాజా స్థానిక ఎన్నికల్లో ఆ ఆధిక్యం సుమారు ఐదు వేల స్థాయికి ఎందుకు పరిమితమైందన్న ప్రశ్నను వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు దక్కకపోయినంత మాత్రాన ప్రజల్లో వైసీపీకి ఆదరణ తగ్గినట్లు కాదని, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ బలాన్ని నిరూపిస్తామని చిర్ల జగ్గిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
స్థానిక ఎన్నికల ఫలితాలపై పార్టీల మధ్య జరుగుతున్న ఈ విశ్లేషణలు రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.