BREAKING
నైజీరియాలో ముగిసిన 21 రోజుల ఎబోలా కాంటాక్ట్ మానిటరింగ్ గ్రామపంచాయతీ ఎన్నికలు కోసం స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమం క్యాన్సర్ చికిత్సను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు నాణ్యమైన గృహ నిర్మాణానికి బిల్డర్లు ప్రాధాన్యమివ్వాలి-మంత్రి నారాయణ అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళిక ఓలా సంస్థకు పది లక్షల జరిమానా విధించిన సీసీపీఏ సుబ్రహ్మణ్యం కు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డు భారత్ - శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు 'మిత్ర శక్తి 2026' ప్రారంభం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫిర్యాదులు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి --- జడ్పీ సీఈవో మధుసూదన్ మూడు రోజుల లాభాలకు గండి, నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ స్థానిక సమరానికి జనసేన కసరత్తు. ఉదయగిరినియోజకవర్గంలో మండలాల వారీగా నేతల సన్నాహాలు. బెంగళూరు-మంగళూరు-మర్గావో మార్గాల్లో నూతన వందే భారత్ చైర్ కార్ సర్వీసులను ప్రారంభించిన ప్రధాని మోదీ భక్తిశ్రద్ధలతో నాగుల చవితి

మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన పి. గన్నవరం జడ్పీటీసీ యడ్ల సుబ్బలక్ష్మి దంపతులు

Select Suryaa Now
మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన పి. గన్నవరం జడ్పీటీసీ యడ్ల సుబ్బలక్ష్మి దంపతులు

సూర్య ఏపీ డెస్క్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలానికి చెందిన యడ్ల సుబ్బలక్ష్మి కూటమి తరఫున జనసేన పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె తన భర్త ఏసు భాస్కరరావుతో కలిసి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన యడ్ల సుబ్బలక్ష్మి దంపతులను మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీలో మహిళలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ, రాజకీయాల్లో ప్రజాప్రతినిధులుగా రాణించే అవకాశాలను అందిస్తున్న నేపథ్యంలో యడ్ల సుబ్బలక్ష్మి విజయం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జడ్పీటీసీ యడ్ల సుబ్బలక్ష్మి మాట్లాడుతూ.. కూటమి నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకుంటూ పి. గన్నవరం మండల సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సాధనాల శ్రీ వెంకట సత్యనారాయణ, జనసేన యువత అధ్యక్షుడు తాటికాయల వెంకటేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.