BREAKING
16న ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోడీ 16న ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోడీ జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి* *సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అరటి సాగులో జీవ నియంత్రణ కారకాలపై అవగాహన సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీలో భారీ మార్పులకు సంకేతాలు ప్రభుత్వ పాఠశాలకు ఆర్.ఓ ప్లాంట్ వితరణ చేసిన ఉపాధ్యాయుడు తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలి అండర్-19 ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్.. ఆఫ్ఘనిస్తాన్పై ఘనవిజయంతో టైటిల్ పోరుకు అర్హత అర్హులైన బాలికలందరికి హెచ్పివి టీకాల అందజేత మేధో సంపత్తి హక్కులు, వ్యవస్థాపకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం *ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి*.. *సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ శుక్రవారం ఉదయం మండల సర్వసభ్య సమావేశం విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన - కాగజ్‌నగర్‌లో క్విజ్, వ్యాసరచన పోటీలు టీమిండియా అభిమానులకు శుభవార్త.. ఫిట్‌నెస్ పరీక్షలో పాసై న్యూజిలాండ్‌కు పయనమవుతున్న రిషబ్ పంత్ శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము, హుండీ (పరకామణి సేవ) లెక్కింపు

ముంబైలో బాంబు బెదిరింపుల కలకలం..

Select Suryaa Now
ముంబైలో బాంబు బెదిరింపుల కలకలం..
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ తీవ్ర కలకలం రేపాయి. నగరంలోని అత్యంత కీలకమైన ప్రాంతాలతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ గుర్తుతెలియని దుండగులు బెదిరింపు మెయిల్స్ పంపారు. ఈ మెయిల్‌లో ముంబై మేయర్ కార్యాలయం (BMC హెడ్ క్వార్టర్స్) మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు హెచ్చరించారు.

బెదిరింపు ఈ-మెయిల్ అందిన వెంటనే ముంబై పోలీసు ఉన్నతాధికారులు, భద్రతా ఏజెన్సీలు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యాయి. ముందుజాగ్రత్త చర్యగా బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), డాగ్ స్క్వాడ్ బృందాలు అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’తో పాటు మేయర్ కార్యాలయం, విమానాశ్రయ పరిసరాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఎవరున్నారనే కోణంలో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి ఐపీ (IP) అడ్రస్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.