international
ఉత్తర కొరియా రాజ్యాంగంలో చారిత్రాత్మక మార్పులు..
ప్యాంగ్యాంగ్: అమెరికా దాడుల ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఏకంగా 54 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా రాజ్యాంగానికి చారిత్రాత్మక సవరణలు చేశారు. అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ రాజ్యాంగ సవరణల్లో ప్రధానంగా మూడు కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా దేశంలోని అత్యంత కీలకమైన అణు ఆయుధాల నియంత్రణ అధికారాన్ని నేరుగా 'స్టేట్ అఫైర్స్ కమిషన్'కు అప్పగించారు. మరోవైపు, ఇప్పటివరకు తమ ప్రధాన శత్రువుగా పరిగణిస్తూ వచ్చిన దక్షిణ కొరియా పట్ల తన వైఖరిని మార్చుకుంటూ, ఇకపై దానిని కేవలం ఒక పొరుగు దేశంగా మాత్రమే గుర్తించేలా రాజ్యాంగంలో సవరణలు చేశారు. వీటితో పాటు దేశంలోని పోలీస్, న్యాయ వ్యవస్థలు మరియు క్యాబినెట్‌పై కిమ్ జోంగ్ ఉన్ తన అధికారిక పట్టును మరింత బిగించారు. అమెరికా నుంచి ఎదురయ్యే ఎటువంటి సైనిక లేదా వ్యూహాత్మక ముప్పునైనా సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు దేశంలో తన ఏకఛత్రాధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకోవడమే కిమ్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.