BREAKING
ఎండపల్లి పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తికి 8810 ధర అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా పబ్లిక్ టాయిలెట్లు ఎర్రావారిపాలెం మండలంలో టీడీపీకి షాక్‌..! తూప్రాన్ గీత స్కూల్లో చాచాజీ ఆకారంలో విద్యార్థులు ఎండపల్లి రహదారుల అభివృద్ధికి రూ.55 లక్షలు మంజూరు చేయాలి రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* *రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి* భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్ రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో త్రిగుణ్.. టెర్రిఫిక్ యాక్షన్‌తో జంగా గ్లింప్స్ విడుదల! *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* నారాయణఖేడ్ మేజర్ న్యూస్ నారాయణఖేడ్ పట్టణం నుండి ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన గనుగాపూర్‌కు నిర్వహించే మహా పాదయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం పెద

ఏఐకేఎస్‌ జాతీయ మహాసభల ప్రచార జాత ప్రారంభించిన డబ్బికార్ మల్లేష్

Select Suryaa Now
ఏఐకేఎస్‌ జాతీయ మహాసభల ప్రచార జాత ప్రారంభించిన డబ్బికార్ మల్లేష్

 

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:

నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్‌) జాతీయ మహాసభల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో గురువారం ప్రచార జాతను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ మహాసభల ప్రాధాన్యతను ప్రజలకు వివరించేందుకు డివిజన్ వ్యాప్తంగా మూడు ప్రచార జాతాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాతాల ద్వారా రైతాంగ సమస్యలు, సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు, రైతుల హక్కుల సాధన తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.

జాతీయ మహాసభల్లో సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం, రైతుల సమస్యల పరిష్కారం, రైతాంగ హక్కుల సాధన వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో రైతాంగ ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్, పట్టణ కార్యదర్శి మల్లు గౌతమ్ రెడ్డి, నాయకులు కోడి రెక్క మల్లయ్య, కేశవులు, రవి, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.