చదువుతోపాటు అన్ జాబ్ శిక్షణ ఎంతో ముఖ్యం.....
రామాయంపేట ; ఇంటర్మీడియట్ ఒకేషనల్ విద్యార్థులకు చదువుతోపాటు ఆన్ జాబ్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలఇన్చార్జి ప్రిన్సిపాల్ గూడూరి మల్లేశం అన్నారు. కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఎలక్ట్రికల్, ఆఫీస్ అసిస్టెంట్ షిప్ అకౌంటెంట్ టాక్సిషన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు నిర్వహిస్తున్న ఆన్ జాబ్ శిక్షణ సెంటర్ లను ఆయన గురువారం తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులు నేర్చుకుంటున్నా పలు అంశాలను పరిశీలించారు. ఎలక్ట్రికల్ కోర్స్ చదువుతున్న విద్యార్థులు మోటార్ వైండింగ్ షాపుల్లో శిక్షణ పొందుతున్నారు. అకౌంటెంట్ టాక్సిషన్ తోపాటు ఆఫీస్ అసిస్టెంట్ షీప్ కోర్సు చదువుతున్న విద్యార్థులు పట్టణంలో గల పలు బ్యాంకులలో శిక్షణ పొందుతున్నారు. అక్కడ వారి నేర్చుకుంటున్నా అంశాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చదువుతోపాటు శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రెండు నెలల పాటు ప్రతి విద్యార్థి ప్రతి అంశంపై పూర్తి అవగాహన కల్పించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో స్వయం ఉపాధితో పాటు ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఇట్టి విషయంలో విద్యార్థులు నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు ఆన్ జాబ్ శిక్షణకు హాజరుకావాలని సూచించారు. ఒకేషనల్ ఎలక్ట్రికల్ కోర్సు తో పాటు అకౌంటెంట్ టాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్ షీప్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఉపాధితో పాటు ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పారు. విద్యార్థులు చేస్తున్న ఆన్ జాబ్ శిక్షణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ వెంట ఒకేషనల్ విభాగం లెక్చరర్లు బాల ప్రకాష్ శ్రీనివాస చారి, అశోక్ గౌడ్, శ్రీనివాస్, నరసింహులు, గౌడ్, శ్రీదేవి ఉన్నారు.