telangana
వేల్పూర్‌లో నలుగురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
సూర్య వేల్పూరు : వేల్పూర్ గ్రామంలో కల్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను నలుగురు లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ మొండి అశోక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడబిడ్డల వివాహ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పేద కుటుంబాలకు కల్యాణ లక్ష్మి పథకం ఎంతోఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలన్న, పంచాయతీ కార్యదర్శి గంగా జమున, జీపీఓ కిషన్ గౌడ్, గంగాధర్, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.