telangana
కోరిటికల్, లింగట్ల, వాంకిడి కేజీబీవీ పాఠశాలలను సందర్శించిన డీఈవో మాధవి
సూర్య.నేరడిగొండ : జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి గురువారం మండలంలోని ప్రాథమిక పాఠశాలలు కొరిటికల్, లింగట్ల, జిల్లా పరిషత్ సెకండరి పాఠశాల వాంకిడి, కేజీబీవీ నేరడిగొండ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో అమలవుతున్న ప్రాథమిక విద్యా అభ్యసన కార్యక్రమం మధ్యాహ్న భోజన పథకం పదవ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ఆమె పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిలను పరిశీలించి, విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక తరగతులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ పర్యటనలో ఎంఈఓ భూమారెడ్డి తో పాటు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.