ప్రారంభం కానున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు.
బిక్కవోలు మేజర్ న్యూస్.మండలంలోని, కొంకుదురు శాఖా గ్రంథాలయంలో నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను వారం రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నట్లు శాఖా గ్రంథాలయ అధికారి ఎన్. బాల తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతలో పఠనాభిరుచిని పెంపొందించడంతో పాటు విజ్ఞానం, సృజనాత్మకతను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన, గ్రంథాలయ ఉద్యమ ప్రముఖులపై ప్రసంగాలు, వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, క్విజ్, క్రీడా పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే రచయితల సందేశాలు, సాహిత్య కార్యక్రమాలు, మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడం, గ్రంథాలయాల ప్రాధాన్యతను తెలియజేయడం, విద్యార్థుల్లో విజ్ఞాన వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. “చదివి నేర్చుకుందాం – నాయకత్వాన్ని పెంపొందించుకుందాం” అనే నినాదంతో నిర్వహించే ఈ వారోత్సవాల్లో విద్యార్థులు, పాఠకులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గ్రంథాలయ అధికారి బాల కోరారు.