అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
రామాయంపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోందని రామాయంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు గోల్పర్తి గ్రామంలో లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను ఆమె పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా అందుతాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మట్టి యాదగిరి, పచ్చంటి రాములు, పరశురాం, ఎర్రం సత్యం, ఎర్ర వెంకీ, యాదగిరి, పాత నరేష్, సాదుల రాజు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.