అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీడీవో శ్రీనివాస్.....
మద్దూర్ .…మద్దూరు మండలంలోని రేబర్తి, వంగపల్లి గ్రామాలలో జరుగుతున్న మహిళా సంఘం భవనాల నిర్మాణాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు ఇంకుడు గుంతల నిర్మాణ పనులను సర్పంచ్ లు నీరటి శ్రీనివాస్, రామస్వామి లతో కలిసి ఎంపీడీవో శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటి సంరక్షణ కోసం జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు ఫామ్ పాండ్స్, ఫిష్ పాండ్స్, నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో పూర్తయిన మహిళా సంఘం భవనాలు గ్రామపంచాయతీ కార్యాలయాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గద్ద వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి కిరణ్ , ఉప సర్పంచ్ బియ్య రమేష్, తదితరులు పాల్గొన్నారు.