BREAKING
2026లో అధికార పార్టీ ఒత్తిళ్లను ఎదుర్కొని వైసీపీ వీరోచిత పోరు... 16న ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోడీ 16న ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోడీ జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి* *సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అరటి సాగులో జీవ నియంత్రణ కారకాలపై అవగాహన సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీలో భారీ మార్పులకు సంకేతాలు ప్రభుత్వ పాఠశాలకు ఆర్.ఓ ప్లాంట్ వితరణ చేసిన ఉపాధ్యాయుడు తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలి అండర్-19 ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్.. ఆఫ్ఘనిస్తాన్పై ఘనవిజయంతో టైటిల్ పోరుకు అర్హత అర్హులైన బాలికలందరికి హెచ్పివి టీకాల అందజేత మేధో సంపత్తి హక్కులు, వ్యవస్థాపకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం *ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి*.. *సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ శుక్రవారం ఉదయం మండల సర్వసభ్య సమావేశం విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన - కాగజ్‌నగర్‌లో క్విజ్, వ్యాసరచన పోటీలు టీమిండియా అభిమానులకు శుభవార్త.. ఫిట్‌నెస్ పరీక్షలో పాసై న్యూజిలాండ్‌కు పయనమవుతున్న రిషబ్ పంత్

మెరుగైన వైద్యానికి రూ.7 లక్షల ఎల్‌ఓసీ అందజేత

Select Suryaa Now
మెరుగైన వైద్యానికి రూ.7 లక్షల ఎల్‌ఓసీ అందజేత

 

 

మంచాల,మేజర్ న్యూస్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెన్నారెడ్డిగూడ గ్రామానికి చెందిన రత్నావత్ శివ నాయక్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు రూ.7 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో మంజూరైన ఎల్‌ఓసీ పత్రాన్ని మంచాల వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ జెనిగే వెంకటేష్ యాదవ్ గురువారం నిమ్స్ ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో శివ నాయక్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా, తలకు శస్త్రచికిత్స చేయాల్సి ఉందని, ఇందుకు భారీగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని జెనిగే వెంకటేష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రూ.7 లక్షల ఎల్‌ఓసీ మంజూరుకు సహకరించారు. ఈ సందర్భంగా జెనిగే వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు వైద్య ఖర్చుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆర్థిక స్థోమత లేక వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ఎల్‌ఓసీ ద్వారా అందే సహాయం ఎంతో ఉపయోగకరమని అన్నారు. పేదలు వైద్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా అధైర్యపడవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నారెడ్డిగూడ మాజీ సర్పంచ్ ఆంబోతు కిషన్ నాయక్, వార్డు సభ్యుడు హర్య, రత్నావత్ స్వామి, బాణావత్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల, రంగారెడ్డి జిల్లా.