రేణిగుంటలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం
రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట పట్టణంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ కోసం కృషి చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ మాజీ అధ్యక్షుడు సిద్ధగుంట సుధాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు తిరుమలరెడ్డి, మాజీ ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గంగారి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ అడ్డంకులు, ప్రలోభాలను ఎదుర్కొని పోరాడిన కార్యకర్తలను అభినందించారు. కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న పంచాయతీ ఎన్నికల్లో సమష్టిగా పోరాడి విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.