మంత్రి ఆనంను కలిసిన విజేతలు, నాయకులు
ఆత్మకూయు, మేజర్ న్యూస్ : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డిని శుక్రవారం ఆత్మకూరు మండల జడ్పిటిసి మెంబర్గా ఇటీవల విజయం సాధించిన డాక్టర్ తూమాటి శశిదర్ రెడ్డి, నువ్వురుపాడు ఎంపీటీసీ స్థానం నుండి విజయం సాధించిన షేక్ ఖాజావలి పలువురు నాయకులు కలిశారు. మంత్రిని వారు శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి, నువ్వూరుపాడు తెనుగుదేశం నాయకుడు కొండ్రెడ్డి రమణారెడ్డి,వాశిలి తెలుగుదేశం నాయకుడు గద్దె వీరరాఘవ నాయుడు, నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ తదితరులు మంత్రిని కలిసి సన్మానించారు. ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలు గురించి వారు మంత్రికి వివరించారు.