BREAKING
నామినేషన్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు : కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి : కలెక్టర్ డీకే బాలాజీ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలి మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా సాయి వంశీ గౌడ్ ఎంపిక సుధాకర్స్ ఐడియల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం జనగణన 2027 జనాభా లెక్కింపును అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాలి విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి పాల్వంచలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నవంబర్ 16వ తేదీ నుంచి ఎరువుల పంపిణీకి నూతన విధానం అమలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు చేయూత

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఏవీఎం కేర్ ఆసుపత్రి ప్రారంభం

Select Suryaa Now
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఏవీఎం కేర్ ఆసుపత్రి ప్రారంభం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:

వికారాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏవీఎం వారి 'కేర్' ఆసుపత్రిని వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్య సభ్యులైన డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ ప్రదీప్ గౌడ్, డాక్టర్ వినోద్‌లను అభినందించారు. వికారాబాద్ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.అనంతరం ఆసుపత్రిలోని క్యాజువాలిటీ, ఎక్స్‌రే తదితర విభాగాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, కౌన్సిలర్‌లు ప్రారంభించి ఆసుపత్రిలోని సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్య వైద్యులు మాట్లాడుతూ.. వికారాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా 2027 జనవరి 31వ తేదీ వరకు 109 రోజుల పాటు ఉచిత ఓపీ సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ లావణ్య, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద పటేల్, విడిడీఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాస్, శివారెడ్డిపేట, దారూరు పీఏసీఎస్ చైర్మన్లు రాజశేఖర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.