telangana
కొమురం భీమ్ మనుమడు మృతి బాధాకరం - ఎమ్మెల్యే కోవ లక్ష్మి
సూర్య జైనూర్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన కొమురం భీమ్ రెండో మనుమడు కుమ్ర భీమ్రావు కుటుంబాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరామర్శించారు. గురువారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం పెద్దదోబ గ్రామంలోని భీమ్రావు నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి సంప్రదాయ పూజలు నిర్వహించి నివాళులర్పించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆయన అన్న, కొమురం భీమ్ పెద్ద మనుమడు కుమ్ర సోనేరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో సిర్పూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తొడసం ధర్మారావు, సర్పంచులు ఆత్రం ఓం ప్రకాష్, పెందూర్ మాధవరావు, నీట్నూర్ మాజీ సర్పంచ్ అర్క నాగోరావు తదితరులు పాల్గొన్నారు.