BREAKING
బోందిడిలో దూడలకు నట్టల మందుల నివారణ పంపిణీ జిల్లాలో 8,209 మందికి కొత్తగా భృతి మంజూరు..ఈ నెల 19 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో భృతి నగదు జమ కొమురం భీమ్ మనుమడు మృతి బాధాకరం - ఎమ్మెల్యే కోవ లక్ష్మి బ్రహ్మాసముద్రం లో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. ఎమ్మెల్యే అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్‌లో చేరిన కుమారి ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సర్వే విభాగం ఆధునికీకరణకు శ్రీకారం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు యాటకలు విద్యార్థులు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందించేందుకు చర్యలు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలి రేణిగుంటలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం వాల్ మార్ట్ వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్ భేటీ జి. లింగాపురం ఎంపీటీసీ షాహిదాకు ఎమ్మెల్యే బుడ్డా ఆశీస్సులు పల్నాడు జిల్లాలో పంచాయతీఎన్నికలకు సర్వం సిద్ధం ఎస్పీ జగదీష్ ఆదహళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మెకు సిద్ధం అభివృద్ధి పనులలో పురోగతి సాధించాలి - జిల్లా కలెక్టర్ కె.హరిత

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వద్ద ఎస్ఎఫ్ఐ ధర్నా: స్పాట్ అడ్మిషన్ల రద్దును ఉపసంహరించుకోవాలని డిమాండ్

Select Suryaa Now
శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వద్ద ఎస్ఎఫ్ఐ ధర్నా: స్పాట్ అడ్మిషన్ల రద్దును ఉపసంహరించుకోవాలని డిమాండ్

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : పీజీ స్పాట్ అడ్మిషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (VC) భవనం వద్ద విద్యార్థి సంకేతిక సమాఖ్య (SFI) ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పీజీ స్పాట్ అడ్మిషన్ల రద్దు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, పేద విద్యార్థులకు యూనివర్సిటీల్లో ఉన్నత విద్య నభ్యసించే అవకాశం కల్పించాలని ధర్నాలో పాల్గొన్న విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు.

​ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల వల్ల విశ్వవిద్యాలయాలు ఖాళీ తరగతి గదులతో వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్పాట్ అడ్మిషన్లను రద్దు చేయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నించిన నాయకులు, విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యమా అని నిలదీశారు.

​ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యూనివర్సిటీలను రక్షించే దిశగా చర్యలు చేపట్టాలని, తక్షణమే పీజీ స్పాట్ అడ్మిషన్లను పునరుద్ధరించాలని వారు కోరారు. లేనిపక్షంలో ఈ ఆందోళనలను రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ హెచ్చరించింది. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు విద్యార్థి నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్