నసనకోట గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంఈఓ
నసనకోట గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంఈఓ
రామగిరి మండల పరిధిలోని నసనకోట బాలికల గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంఈఓ శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగదిని పరిశీలించి, విద్యార్థులకు వడ్డిస్తున్న భోజన నాణ్యత, వంటకు ఉపయోగిస్తున్న కాయగూరల నిల్వలను పరిశీలించారు. అలాగే స్టోర్ రూమ్‌ను తనిఖీ చేసి ఆహార పదార్థాల నిల్వ వివరాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి జిల్లా కన్వీనర్ పాఠశాల ప్రిన్సిపల్ జమునా బామ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు
మధుసూదన్ గౌడ్ సూర్య రామగిరి