ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన వెంకటాపూర్ (ఆర్) గ్రామంలో ప్రత్యేక అధికారి తనిఖీ
రామాయంపేట ; రామాయంపేట మండలం పరిధిలోనివెంకటాపూర్ (ఆర్) గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రత్యేక అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణాల పురోగతిని తనిఖీ చేసి, పనుల వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి ఎంపీడీవో సలాజుద్దీన్, హౌసింగ్ ఏఈ, గ్రామ కార్యదర్శి పాల్గొన్నారు.