BREAKING
రూ.632 కోట్లతో ఎత్తిపోతల పథకాల మరమ్మతులు విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని చాటిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి మార్వెల్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అప్‌డేట్.. అవెంజర్స్ డూమ్‌డేలో స్కార్లెట్ విచ్ రీఎంట్రీ! కుల్గామ్‌లో సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై కాల్పులు కిడ్నీ బాధితురాలికి రూ.4 లక్షల ఎల్‌ఓసీ మంజూరు వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటా... మాజీ జడ్పిటిసి వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎల్ఈ.పుష్పావతి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి పాతనగరం కాదు.. 'ఒరిజినల్ సిటీ కూటమి ప్రభుత్వ అరాచకాలపై అనంతలో సిపిఐ, సిపిఎం నిరసన ర్యాలీ పటాన్‌చెరు నుంచి ఈపీఎఫ్ కార్యాలయం తరలించొద్దు సిమ్స్ ఆసుపత్రి యాజమాన్యానికి జిజిహెచ్ సూపరింటెండెంట్ ఘన సన్మానం మాగుంట ను కలసినదర్శి జెడ్పిటిసి. 34 ఏళ్ల సేవకు తోటి హోంగార్డుల ఆపన్నహస్తం: పదవీ విరమణ పొందిన హోంగార్డుకు రూ. 4.95 లక్షల ఆర్థిక సాయం సాగునీటి ప్రాజెక్టుపై సమీక్ష

రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి

Select Suryaa Now
రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి

మంచాల, మేజర్ న్యూస్::అఖిలభారత రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బోడ సామెల్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాడిగల భాస్కర్ పిలుపునిచ్చారు. బుధవారం మంచాల మండల కేంద్రంలోని కాచం కృష్ణమూర్తి భవన్‌లో సీపీఎం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి  హాజరై వారు మాట్లాడుతూ.. నవంబర్ 15, 16, 17 తేదీల్లో నల్లగొండ జిల్లా కేంద్రంలో మూడు రోజులపాటు అఖిలభారత రైతు సంఘం జాతీయ మహాసభలు జరగనున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా నవంబర్ 15న నిర్వహించే బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జాతీయ మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మంచాల మండల కార్యదర్శి రావుల జంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, ఎన్. శ్యాంసుందర్, మండల కార్యదర్శివర్గ సభ్యులు మార బుగ్గ రాములు, ఆర్. స్వామి, మండల కమిటీ సభ్యులు పోచమోని కృష్ణ, పి. గోపాల్, అన్నారం లెనిన్, యాట జగన్, పగడాల విజయ, రైతు సంఘం మండల అధ్యక్షుడు లట్టుపల్లి శేఖర్ రెడ్డి, జపాల్ గ్రామ శాఖ కార్యదర్శి కుకూడల పాపిరెడ్డి, మథని జంగయ్య, తిప్పాయిగూడ శాఖ కార్యదర్శి బుర్రి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల, రంగారెడ్డి జిల్లా.