BREAKING
ఓటీటీలో అదరగొడుతున్న రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ 'భక్షక్'.. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం! నవంబర్ 14 నుంచి పాములపాడులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు భారత్ సమ్మిట్ విజయవంతం చేయాలిః టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ ఖానాపూర్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు సింగరేణి కంపెనీ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం - ప్రారంభించిన జీఎం ఎన్. రాధాకృష్ణ బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం.. కంటెస్టెంట్ల సమక్షంలో శివ్, ప్రియాంక నిశ్చితార్థం! భారీ వాహనాలకు వేళల ఆంక్షలు రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు 9 మంది ఎంపిక 360 డిగ్రీ యాప్ ద్వారా చేయూత పింఛన్ల లబ్ధిదారుల వివరాల పరిశీలన వీఓ భవనానికి స్థలం కరువు.. డ్వాక్రా మహిళల ఆవేదన! సర్ సిల్క్ బాధితులకు న్యాయం చేస్తాం.. భయపడొద్దు - ఎమ్మెల్సీ దండే విఠల్ రామాయణంలో రాజా మాలి లుక్ కోసం నాలుగు గంటల కష్టం.. నటుడు చేతన్ హన్స్‌రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు! సర్ సిల్క్ బాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు - పొన్న రమేష్ జైనూర్ డివిజన్ స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయాలి – ఏటీడీఓ శ్రీనివాస్ ఆకర్షణీయమైన శీర్షికతో 'ఇంకా ఏం అనుకోలేదు!'.. డిసెంబర్ 11న థియేటర్లలోకి వస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్!

కిడ్నీ బాధితురాలికి రూ.4 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

Select Suryaa Now
కిడ్నీ బాధితురాలికి రూ.4 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

 

వైద్య చికిత్సకు అండగా నిలిచిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు, మేజర్ న్యూస్:
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పేద మహిళకు మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అండగా నిలిచారు. కందుకూరు మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన కుమ్మరి శంకరమ్మ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్న విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే మానవతా దృక్పథంతో స్పందించారు.
బాధితురాలి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా రూ.4 లక్షల విలువైన ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరయ్యేలా కృషి చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్స పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
ఎమ్మెల్యే చొరవతో వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందడంతో బాధిత కుటుంబ సభ్యులు సబితా ఇంద్రారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సామ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూర్, రంగారెడ్డి జిల్లా.