telangana
సర్ సిల్క్ బాధితులకు న్యాయం చేస్తాం.. భయపడొద్దు - ఎమ్మెల్సీ దండే విఠల్
సూర్య,కాగజ్‌నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ సర్ సిల్క్ సంస్థ పరిధిలో నివాసం ఉంటున్న పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా, వారి నివాస హక్కులకు భంగం కలగకుండా న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు.ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్ల బృందం, కోయవాగు, చింతగూడ ప్రాంతాలకు చెందిన నాయకులు ఆఫీషియల్ లిక్విడేటర్‌ను కలిసి సర్ సిల్క్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఎన్నో ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలను ఒక్కసారిగా ఖాళీ చేయించాలనే పరిస్థితి ఏర్పడితే వారి జీవితాలు రోడ్డున పడతాయని లిక్విడేటర్ దృష్టికి తీసుకెళ్లారు.