చిన్నారులను ఆశీర్వదించిన చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి
గణపురం, మేజర్ న్యూస్, గణపురం మండల కేంద్రంలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ సోదరుడు రేపాక నరసింహ కుమార్తెలు వరూధిని, సాత్వికల నూతన వస్త్రాలంకరణ, ఓడినింపుడు కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు భూపాలపల్లి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి భవిష్యత్తు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మామిళ్ల మల్లికార్జున గౌడ్.బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్ రెడ్డి, బీజేపీ గణపురం మండల కన్వీనర్ మంద మహేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సయ్యద్ గాలిఫ్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మాదాసు మొగిలి గౌడ్, సీనియర్ నాయకుడు సోమ దామోదర్, మండల నాయకుడు చెలుమల్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: ఎల్లయ్య, గణపురం ,జయశంకర్ భూపాలపల్లి