BREAKING
రేపు ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల! ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఏపీలో అపారమైన అవకాశాలు త్రైత సిద్ధాంత భగవద్గీత తో ఆధ్యాత్మిక వెలుగు చిట్టమూరులో పోషణ్ శిక్షణ కార్యక్రమం బాల్య వివాహాలు, వరకట్నం,మహిళా భద్రతపై అవగాహన డిఆర్యుసిసి సభ్యునిగా గొట్టికాటి రవీంద్రా రెడ్డి రైల్వే సేవల అభివృద్ధి కమిటీలో గొట్టికాటికి స్థానంపై పలువురి హర్షం అమెరికా కోర్టు సమన్లపై భారత్ అభ్యంతరం: అజిత్ దోవల్, సామంత్ గోయల్ వివాదం అనారోగ్య సమస్యతో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్, బెల్టులు, షూస్ పంపిణీ కుల్గాంలో సీఆర్‌పీఎఫ్‌పై ఉగ్రదాడి: ముగ్గురు జవాన్లకు గాయాలు పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం * సర్పంచుల రిజర్వేషన్స్ ఖరారు * సముద్రాలలో వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ రాణి మల్లమ్మ దేవి పార్కు ను పరిశీలించిన మున్సిపల్ ఎన్నికలు ప్రకృతి వ్యవసాయం రైతుల బాధ్యతగా మారాలి! ముంద్రా ప్లాంట్ పునరుద్ధరణ, సోలార్ వ్యాపారంతో భారీ లాభాలు వీళ్లే విజేతలు ...

ఇల్లందకుంటలో ఉచిత AI (ఏఐ) శిక్షణ కేంద్రం ప్రారంభం

Select Suryaa Now
ఇల్లందకుంటలో ఉచిత AI (ఏఐ) శిక్షణ కేంద్రం ప్రారంభం
సూర్య, ఇల్లందకుంట : గ్రామీణ యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను చేరువ చేసే లక్ష్యంతో కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో ఏర్పాటు చేసిన "ఉచిత AI (ఏఐ) శిక్షణా కేంద్రం" ను యూప్ టీవీ, ట్యూరీటో సంస్థల వ్యవస్థాపకులు సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట ఇల్లందకుంట హుజురాబాద్ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు విద్యార్థులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయ్ నందన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం వేగంగా మారిపోతుందని ఈ మార్పుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ జనాభాలో 60% పైగా యువతే ఉన్నారని, వారు రోజువారి జీవితంలో AI (ఏఐ)ని ఉపయోగించడం నేర్చుకుంటే ఏ తరం కంటే వేగంగా ఎదగ గలరని పేర్కొన్నారు. ఈ అవకాశం కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకూడదని, మన పల్లెలకు మన పిల్లలకు చేరాలి అని, మన ఇల్లందకుంటలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. విద్యా ఉద్యోగాలు, కెరీర్ అభివృద్ధి, వ్యాపారం, ఆరోగ్యం, వ్యవసాయం, మీడియా, సృజనాత్మక రంగాలు అనే రంగాలలో AI (ఏఐ) సాంకేతికతపై విద్యా శిక్షణ అవగాహన కల్పించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశం అని ఆయన తెలిపారు. మన విద్యార్థులు AI (ఏఐ)ని తమ కోసమే నేర్చుకోరని దాన్ని తమ గ్రామాలకు తీసుకెళ్లి మన రైతులకు, మన పాఠశాలకు, మన కుటుంబాలకు సహాయం చేస్తారన్నారు. ఇలా నైపుణ్యాలు ప్రయోజనాలు గ్రామాల్లోనే ఉండి మొత్తం ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని ఆయన అన్నారు. " AI (ఏఐ) మన భవిష్యత్తు " అనే నినాదంతో ప్రారంభమైన ఈ కేంద్రం కరీంనగర్ జిల్లా యువతకు కొత్త అవకాశాల వేదికగా నిలుస్తుందని ఉదయ్ నందన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.