BREAKING
ఉద్యోగుల సమస్యలను త్వరగా పరిష్కరించాలి: టీఎన్జీవోస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ అధికారులు సమన్వయంతో పని చేయాలి ఎమ్మెల్యే సంజీవరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కోసం ప్రతిపాదించిన కేంద్రాలు గ్రామాల పేర్లు, కోడ్లు, జనాభా వివరాలు భూ నిర్వాసితులను ఇంకెప్పుడు ఆడుకుంటారు?! సీఎం సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్, సిపి బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శ్రీకాంత్ గౌడ్ ల్యాండ్‌ పూలింగ్‌తో ప్రాంత అభివృద్ధికి కొత్త రూపు:కీసర ఆర్డీవో నల్ల వెంకటరెడ్డి రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం – గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం... *సీసీ కెమెరాల నిఘానిడలో పోరేడ్డిపల్లి గ్రామం* చిన్నారి శారీ ఫంక్షన్‌లో పాల్గొని ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శాంత్ కుమార్

దేశంలో విద్యా రంగ అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ - జిల్లా కలెక్టర్ కె.హరిత

Select Suryaa Now
దేశంలో విద్యా రంగ అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ - జిల్లా కలెక్టర్ కె.హరిత
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : దేశంలో విద్యా రంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషి చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం స్వాతంత్ర సమరయోధుడు, విద్యావేత్త, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎం.డి. అహ్మద్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అలీబిన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్లతో కలిసి హాజరై ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశంలో విద్యారంగ అభివృద్ధికి చేసిన కృషి నేటి తరం స్పూర్తిగా తీసుకోవాలని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీతో కలిసి పాల్గొని స్వాతంత్రం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించారని, మహనీయుల ఆశయాలను నేటితరం యువత కొనసాగించాలని తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తిరుపతి, కౌన్సిలర్లు సాలాంబిన్ అహ్మద్, బాలకృష్ణ, మైనారిటీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.