BREAKING
వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతారా..? ప్రజా సేవే పరమార్థంగా ముందుకు సాగుతారా..? స్వచ్ఛ రాజకీయాలకు నాంది పలుకుతారా..? చిత్తలూరులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన శాఖ ప్రారంబించిన చైర్మన్ ప్రతాప్ రెడ్డి విద్యార్థులకు కుంగ్ ఫూ, కరాటేలో ప్రత్యేక శిక్షణ నీటి వృథా, దుమ్ము కాలుష్యంపై సర్పంచుల ఆందోళన గ్రామపంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు * అధికారులకు బాధ్యతలపై దిశానిర్దేశం * భక్తిశ్రద్ధలతో గోవర్ధన పూజ నిర్వహించిన శీర్వి సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు హంబాడ్ మోహన్ లాల్ చౌదరి ధాన్యం కొనుగోలును పారదర్శకంగా నిర్వహించాలి రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ... 40 వ వార్డులో డ్రైనేజీలు పరిశుభ్రత.. జాతీయ విద్యా దినోత్సవం.. విద్యార్థులకు క్విజ్ పోటీలు ఖచ్చితమైన, నాణ్యమైన డేటా సేకరించాలి అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి రహ్మత్ షా! సిలువగుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం.. టిప్పర్లు అడ్డగింత! ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా భారతరత్న జనబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు

చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక

Select Suryaa Now
చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు  ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక

దుర్గి మండల ప్రజలు సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ వడ్డె శ్రీనివాసరావు సూచించారు. కొందరు సైబర్‌ నేరగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుని రూ.10 వేలు, రూ.20 వేలు ఇస్తామంటూ వారి బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకుని అక్రమ లావాదేవీలకు వినియోగిస్తున్నారని తెలిపారు.ఇలాంటి మోసాల వెనుక ఉన్న అసలు విషయాలు తెలియకుండానే తమ బ్యాంకు ఖాతాలను ఇతరులకు అప్పగిస్తున్న ఖాతాదారులు చివరకు పోలీసు కేసులు, ఎఫ్‌ఐఆర్‌లలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హెచ్చరించారు. సైబర్‌ నేరగాళ్లు చేసే అక్రమ లావాదేవీలకు తమ ఖాతాలు వేదికగా మారితే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.కేవలం కొంత డబ్బు ఆశతో తమ బ్యాంకు ఖాతాలను ఇతరులకు అప్పగించి భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని సూచించారు. ఎవరూ తమ బ్యాంకు ఖాతాలను ఇతరుల లావాదేవీల కోసం వినియోగించేందుకు అనుమతించకూడదన్నారు. బ్యాంకు ఖాతాల భద్రత, సైబర్‌ మోసాల నివారణకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమాచారం అవసరమైతే నేరుగా బ్యాంకు అధికారులను సంప్రదించాలని మేనేజర్ వడ్డె శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


 

పేర్ల వెంకటేశ్వర్లు సీనియర్ రిపోర్టర్ దుర్గి