BREAKING
చిలకలూరిపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా మొదటి విడత నుంచి మూడో విడతకు ఎన్నికల షెడ్యూల్ మార్పు డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహణకు అధికారుల నిర్ణయం మాంస ఉత్పత్తులపై వర్క్‌షాప్‌ ప్రారంభం మౌలానా అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం ఆపదలో ఉన్న వారికి 5,000/- రు. ఆర్థిక సహాయం అందిస్తున్న..... పీపుల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్ అధ్యక్షులు గూడవల్లి. గంగాధర్ దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు అంతర్జాతీయ స్థాయి క్రీడల లక్ష్యంగా....

సిలువగుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం.. టిప్పర్లు అడ్డగింత!

Select Suryaa Now
సిలువగుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం.. టిప్పర్లు అడ్డగింత!

 

• అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన కరువు 

• తక్షణమే తవ్వకాలు నిలిపివేసి సమగ్ర విచారణ చేపట్టాలి 

• స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

 - సీపీఐ నాయకులు

సూర్య, లక్షెట్టిపేట :

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రంలోని సర్వే నంబర్ 66లో ఉన్న సిలువగుట్టపై జరుగుతున్న అక్రమ తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని సీపీఐ పార్టీ లక్షెట్టిపేట మండల నాయకులు డిమాండ్ చేశారు. గుట్టను యథేచ్ఛగా తవ్వుతూ మట్టిని మొరం రూపంలో విక్రయిస్తూ కొందరు అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో బుధవారం సిలువగుట్ట నుంచి మొరం లోడ్లతో వెళ్తున్న టిప్పర్లను అడ్డుకొని నిరసన తెలిపారు.

సిలువగుట్ట నుంచి భారీ ఎత్తున మొరాన్ని టిప్పర్ల ద్వారా మంచిర్యాల పట్టణానికి తరలిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. జిల్లా స్థాయి మైనింగ్ అధికారి ఇచ్చిన అనుమతులు మాత్రమే ఆధారంగా చేసుకొని, జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలు, అవసరమైన పర్యావరణ అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు గుట్టపై నివసించే పశుపక్షాదులు, ఇతర జీవరాశుల సహజ ఆవాసాలు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అక్రమ తవ్వకాలపై ఈ నెల 3న మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజనీర్‌కు, హైదరాబాద్‌లోని కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులకు, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ కార్యాలయానికి ఫిర్యాదులు సమర్పించినట్లు వెల్లడించారు. ఈ నెల 4న రాష్ట్ర గనులు, సంబంధిత శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి సైతం వినతిపత్రం అందజేసి తవ్వకాలను నిలిపివేయాలని కోరినట్లు పేర్కొన్నారు.

గత వారం రోజులుగా నిరసనలు తెలియజేస్తూ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రకృతి సంపదను పరిరక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం సరికాదని విమర్శించారు. తక్షణమే తవ్వకాలను నిలిపివేసి, మైనింగ్ అనుమతులు, పర్యావరణ అనుమతులపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి సిలువగుట్టను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోకపోతే ప్రజలను సమీకరించి సీపీఐ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ లక్షెట్టిపేట మండల కార్యదర్శి మేదరి దేవవరం, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కేతిరెడ్డి రమణారెడ్డి, పట్టణ కార్యదర్శి అవునూరి వెంకటేష్‌తో పాటు మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.