BREAKING
స్వచ్ఛ భారత్ అవార్డుల్లో 6 పురస్కారాలు కైవసం చేసుకున్న ఏపీ గ్రామంలో కృతజ్ఞత పర్యటన గ్రామంలో కృతజ్ఞత పర్యటన భూ రి సర్వేకు రైతుల భాగస్వామ్యం కీలకం కరోనా కొత్త వేరియంట్ పి జె 2.1 కలకలం ప్రపంచ దేశాలు అప్రమత్తత. స్వచ్ఛ సిటీగా రాజమహేంద్రవరం బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి పలువురు నేతలు! ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటల సాగు.. - నవార దేశీ వరి సాగు చేసిన రైతుకు సన్మానం క్విజ్ పోటీల్లో మండపేట విద్యార్థులు ప్రతిభ రీ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించండి మాజీ సీఎం జగన్ ను కలిసిన వైస్సార్సీపీ కన్వీనర్ రవి రెడ్డి దోమల నివారణకు చర్యలు ‘పీపీపీ’ ముసుగులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రీసర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలి.. నవంబర్ నెలాఖరులోగా తొలి విడత సర్వే పూర్తి చేయాలి.. - మంత్రి పొంగులేటి వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన వైసిపి నాయకులు

జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు

Select Suryaa Now
జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : కరకంబాడి రోడ్డులోని శ్రీరామ అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. జయచంద్రకు జేఎన్టీయూ ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డును ప్రధానం చేసింది. అనంతపురంలోని జేఎన్టీయూలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన వీసీ సుదర్శన రావు చేతుల మీదుగా ఈ అవార్డుతో పాటు నగదు బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ కళాశాల ఛైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ 16 సంవత్సరాలు గా డాక్టర్ జయచంద్ర తమ కళాశాలలో ప్రిన్సిపాల్ విధులు నిర్వహిస్తూ కళాశాల ఎదుగుదలతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. విద్యారంగంలో వారు చేస్తున్న కృషిని గుర్తించి యూనివర్సిటీ ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డును అందించడం హర్షనీయమన్నారు. కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ ఈ అవార్డు కళాశాలకు ఎంతో గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కళాశాల బోధన బోధనేతర సిబ్బంది ప్రిన్సిపల్ ను అభినందించారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్