వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన వైసిపి నాయకులు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ నాగులపల్లి ధనలక్ష్మి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రంపచోడవరం నియోజకవర్గ పరిశీలకులు కర్రి పాపారాయుడు లు బుదవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో 5 జెడ్పీటీసీ స్థానాలు, 41 ఎంపీటీసీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించిన నాయకులను, కార్యకర్తలను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను నాగులపల్లి ధనలక్ష్మి, కర్రి పాపారాయుడు జగన్‌మోహన్ రెడ్డికి వివరించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ విజయానికి కృషి చేయాలని, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు.