BREAKING
ప్రతిరోజూ పుదీనా ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ప్రతిరోజూ తగినన్ని నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. వైద్యులు చెబుతున్న ముఖ్యమైన సూచనలు! ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ఆవేశం, సీన్ చిత్రాలకు సీక్వెల్స్ ఉండవు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ జిత్తు మాధవన్! ముంబైకి చేరుకున్న ప్రముఖ సింగర్ రిమి టోమి.. లిబిన్ మాథ్యూతో వివాహం కోసం జోరుగా ఏర్పాట్లు! నాని 'ది ప్యారడైజ్' టీమ్‌పై సీనియర్ నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు.. లుక్ టెస్ట్ చేసి అలాగే వదిలేశారంటూ ఆగ్రహం! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం! దుర్గాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేలు విరాళం. అంగన్వాడీలకు ముగిసిన రెండో విడత శిక్షణ. చోరీ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష. రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' సినిమాపై మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఆసక్తికర రివ్యూ! మేయర్ శ్రావణికి నీలబాబు అభినందన పిల్లల సమగ్ర అభివృద్ధిపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఉచిత మెగా వైద్య శిబిరంలో 236 మందికి పరీక్షలు

వైయస్‌ జగన్‌ను కలిసిన అనంతపురం మేయర్‌ సి.రమేష్‌ గౌడ్‌ : ప్రత్యేకంగా అభినందించిన మాజీ ముఖ్యమంత్రి : హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్ కుమార్ రెడ్డి

Select Suryaa Now
వైయస్‌ జగన్‌ను కలిసిన అనంతపురం మేయర్‌ సి.రమేష్‌ గౌడ్‌ : ప్రత్యేకంగా అభినందించిన మాజీ ముఖ్యమంత్రి : హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్ కుమార్ రెడ్డి


మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : అనంతపురం నగర మేయర్‌గా ఎన్నికైన సి.రమేష్‌ గౌడ్‌ తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి,వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.యస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన మేయర్‌ రమేష్‌ గౌడ్‌ను వైయస్‌ జగన్‌ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతపురం నగర ప్రజలు తనపై,వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని,నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని రమేష్‌ గౌడ్‌కు వైయస్‌ జగన్‌ సూచించారు.ప్రజల పక్షాన నిలబడుతూ నగరాభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని,అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.అధికార కూటమి శ్రేణులు ఎన్ని కుట్రలు,ప్రలోభాలు,బెదిరింపులకు పాల్పడిన వాటికి వెరవకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలిచిన అనంతపురం నగర ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపైనా ఉందని పేర్కొన్నారు.అలాంటి ప్రజలకు సేవచేసే గొప్ప అవకాశం లభించిందని,వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ మంచిపేరు తెచ్చుకోవాలని,రాజకీయం గా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని రమేష్‌ గౌడ్‌ను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా రమేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మేయర్‌గా అవకాశం కల్పించిన వైయస్‌ జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తన రాజకీయ ప్రస్థానంలో అండగా నిలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు,పార్టీ కార్యకర్తలు,శ్రేణులు,అనంతపురం నగర ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.తనకు లభించిన అవకాశాన్ని బాధ్యతగా భావించి,ప్రజల సమస్యల పరిష్కారానికి,నగరాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా రమేష్‌ గౌడ్‌ కుటుంబ సభ్యులు కూడా వైయస్‌ జగన్‌ను కలిశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి,పార్టీ సీనియర్‌ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి,సాకే శైలజానాథ్‌,తలారి రంగయ్య,నరేష్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి