రాష్ట్ర స్థాయి కోకో ఫోటోలకు వానపల్లి విద్యార్థి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు వానపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని కోనాల స్నేహలత ఎంపికైంది.కాకినాడ జిల్లా క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో అండర్-14 విభాగంలో స్నేహలత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది.ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఏలూరు జిల్లా పూళ్లలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ఆమె ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్.వెంకటేశ్వరరావు తెలిపారు.విద్యార్థినికి శిక్షణ అందించిన వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.వెంకటరమణ,కె.అగ్నికుమార్ లతో పాటు స్నేహలతను విద్యాకమిటీ చైర్మన్ ఎ.శ్రీనివాసరావు,ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది అభినందించారు.రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.