BREAKING
నేటి పంచాంగం 13నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు 13 నవంబర్, 2026 వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్..

Select Suryaa Now
స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద  పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలి... జిల్లా కలెక్టర్  మహేష్ కుమార్..

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద  పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలి...
జిల్లా కలెక్టర్  మహేష్ కుమార్..

అమలాపురం మేజర్ న్యూస్ 
ఈవీఎంలు, వీవీప్యాట్‌ల భద్రత విషయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, గోదాములు, స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిరంతరం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
బుధవారం మమ్మిడివరంలోని ఎయిమ్స్ కళాశాల మూడో అంతస్తులో ఏర్పాటు చేసిన ఈవీఎం గోదాములు, స్ట్రాంగ్‌రూమ్‌లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా యంత్రాల భద్రపరిచే విధానం, సీసీ కెమెరాల పనితీరు, విద్యుత్ సరఫరా, అగ్నిమాపక భద్రత, పోలీసు బందోబస్తు తదితర అంశాలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.నిరంతర సీసీ కెమెరాల నిఘా తప్పనిసరి ఈవీఎం గోదాములు, స్ట్రాంగ్‌రూమ్‌ల పరిసర ప్రాంతాలు 24 గంటల పాటు సీసీ కెమెరాల నిఘాలో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.  విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని, సిబ్బంది విధుల వివరాలు, లాగ్‌బుక్‌ల నిర్వహణను క్రమబద్ధంగా చేపట్టాలని ఆదేశించారు.
అనధికార ప్రవేశాలపై కఠిన నిఘాస్ట్రాంగ్‌రూమ్‌లు, ఈవీఎం గోదాముల పరిసరాల్లోకి అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని, భద్రతా నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదని స్పష్టం చేశారు.నిల్వ చేసిన యంత్రాల వివరాలపై నిరంతర తనిఖీలు గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్‌ల వివరాలు, వాటి నిల్వకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధివిధానాల ప్రకారం యంత్రాల భద్రత, నిర్వహణ చేపట్టాలని అధికారులకు తెలిపారు.
సమస్యలు తలెత్తితే తక్షణమే పరిష్కరించాలి
సీసీ కెమెరాలు, విద్యుత్ సరఫరా, పోలీసు బందోబస్తు, ఇతర భద్రతా ఏర్పాట్లలో ఏవైనా లోపాలు గుర్తించిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల భద్రత ఎన్నికల ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, ఈ విషయంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట మమ్మిడివరం తహసీల్దార్ సుభాష్, డిప్యూటీ తహసీల్దార్ శివరాజ్, సంబంధిత ఎన్నికల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.