గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనులు చేసిన అభివృద్ధే గెలిపించింది
గ్రామంలో గబ్బర్ సింగ్ సోదరులు కృతజ్ఞతా పర్యటన
ఆత్రేయపురం మేజర్ న్యూస్ మండల కేంద్రం ఆత్రేయపురంలో ఈ నెల 27న నిర్వహించిన ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన రెండు ఎంపీటీసీ స్థానాలను గెలిపించిన గ్రామస్తులకు వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు సొసైటీ అధ్యక్షులు ముదునూరి రాంబద్రి రాజులు కృతజ్ఞతలు తెలిపారు అందులో భాగంగా బుధవారం గ్రామంలో ఇంటింటా పర్యటన చేస్తూ స్వీట్లను పంచుతూ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామానికి చెందిన రెండు ఎంపీటీసీ స్థానాలకు కూటమి తరుపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముదునూరి అనంతలక్ష్మి తీగిరెడ్డి నారాయణరావు గెలుపొందడంతో పాటు జడ్పిటిసి గా పోటీ చేసిన గూడపాటి శ్రీనివాసరావుకు గ్రామస్తులు అత్యధిక మెజార్టీతో గెలిపించారు దీంతో బుధవారం గ్రామంలో చేపట్టిన కృతజ్ఞత పర్యటన అందరిని ఆకట్టుకుంది ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యానందరావు ఆధ్వర్యంలో గ్రామంలో కోట్లాది రూపాయలతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనులు చేశామని చేసిన అభివృద్ధి సంక్షేమ రెండు ఎంపీటీసీలు గెలిపించిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు