నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు ఘన సన్మానం –
నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు ఘన సన్మానం – అభినందనలు...
అమలాపురంమేజర్ న్యూస్ నూతన మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన శ్రీ నల్లా శ్రీధర్‌ను బీవీసీ మరియు బీవీసీ అక్షర్ విద్యాసంస్థల అధినేత శ్రీ బోనం కృష్ణ సతీష్ ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ బండి గుప్తపు పాండురంగారావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా వారిద్దరూ నూతన చైర్మన్ శ్రీ నల్లా శ్రీధర్‌ను శాలువాతో సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
అమలాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షిస్తూ, పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమం లో ఏడిద శ్రీను తదితరులు పాల్గొన్నారు