BREAKING
యశ్ తో రొమాంటిక్ సీన్లపై సిద్ధార్థ్ అన్ డిస్టర్బ్డ్.. సినిమా పరాజయంపై కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో కాలంగి విద్యార్థుల ప్రతిభ వైయస్‌ జగన్‌ను కలిసిన అనంతపురం మేయర్‌ సి.రమేష్‌ గౌడ్‌ : ప్రత్యేకంగా అభినందించిన మాజీ ముఖ్యమంత్రి : హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్ కుమార్ రెడ్డి షేర్‌షా' షూటింగ్ సమయంలో సిద్ధార్థ్‌తో బ్రేకప్ అయింది.. సీక్రెట్ బయటపెట్టిన కియారా అద్వానీ! ఘనంగా మెట్ల రమణబాబు జన్మదిన వేడుకలు. టేబుల్ రీడ్ సరిగ్గా చేయలేదని హీరోయిన్‌ను తొలగించిన ప్రఖ్యాత దర్శకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు ఘన సన్మానం – యూనియన్ బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కూతురు దేవితో కలిసి దీపికా, రణ్‌వీర్ సింగ్ అపురూప దీపావళి వేడుకలు.. బెంగళూరులో ప్రత్యేక సెలబ్రేషన్స్! జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు రాష్ట్ర స్థాయి కోకో ఫోటోలకు వానపల్లి విద్యార్థి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనులు చేసిన అభివృద్ధే గెలిపించింది స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. విధుల్లో అలసత్వం వహిస్తే నౌకరిపోతుంది-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు

‘పీపీపీ’ ముసుగులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ

Select Suryaa Now
 ‘పీపీపీ’ ముసుగులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ

అమరావతి :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించేందుకు ఉద్దేశించిన వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ‘పీపీపీ’ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) ముసుగులో ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తోందని ఆయన ఆరోపించారు.

తమ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, వాటిలో 5 కాలేజీల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామని, మరో 3 కాలేజీల్లో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధం చేశామని జగన్ గుర్తుచేశారు. వైద్య రంగాన్ని లాభాపేక్ష కలిగిన వ్యాపారంగా మార్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని ఆయన విమర్శించారు.