భూ రి సర్వేకు రైతుల భాగస్వామ్యం కీలకం
బయ్యారం, మేజర్ న్యూస్, భూముల వివరాలను కచ్చితంగా నమోదు చేసి భవిష్యత్తులో భూ సరిహద్దుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియకు రైతులు పూర్తి సహకారం అందించాలని బయ్యారం తహసీల్దార్ చప్పిడి నాగరాజు కోరారు. మండలంలోని సింగారం రెవెన్యూ పరిధిలో జరుగుతున్న భూ రీసర్వేను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సర్వే సమయంలో రైతులు తప్పనిసరిగా తమ తమ పొలాల వద్ద అందుబాటులో ఉండి,సర్వే సిబ్బందికి భూములకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలని సూచించారు.భూ సరిహద్దులు, విస్తీర్ణం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రైతుల భూములకు సంబంధించిన వివరాల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలంటే రైతుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.భవిష్యత్తులో భూ తగాదాలు,సరిహద్దు వివాదాలు తలెత్తకుండా ఈ ప్రక్రియ దోహదపడుతుందని తహసీల్దార్ వివరించారు.
రిపోర్టర్ ;స్వామి, బయ్యారం మహబూబాద్ జిల్లా