BREAKING
బొడ్డు చింతలపల్లి లో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తా...! బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న రణ్‌బీర్ కపూర్ 'రామాయణం'.. వేగంగా వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూకుడు! సీఐ విశ్వేశ్వర్ విశ్వరూపం మరోసారి సింగర్‌గా మారిన బాలకృష్ణ.. 'దాదా ధమాకా' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్! వివాదాల నడుమ కమల్‌హాసన్ కొత్త సినిమా టైటిల్.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి 'సండియర్' చర్చ! తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీకాంత్ కుమార్తె మేధా మేకా.. వరుస ఆఫర్లతో దూకుడు! బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సూర్య 'సీన్' సినిమా.. వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన క్రైమ్ కామెడీ చిత్రం! ప్రతిరోజూ పుదీనా ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ప్రతిరోజూ తగినన్ని నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. వైద్యులు చెబుతున్న ముఖ్యమైన సూచనలు! ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ఆవేశం, సీన్ చిత్రాలకు సీక్వెల్స్ ఉండవు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ జిత్తు మాధవన్! ముంబైకి చేరుకున్న ప్రముఖ సింగర్ రిమి టోమి.. లిబిన్ మాథ్యూతో వివాహం కోసం జోరుగా ఏర్పాట్లు! నాని 'ది ప్యారడైజ్' టీమ్‌పై సీనియర్ నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు.. లుక్ టెస్ట్ చేసి అలాగే వదిలేశారంటూ ఆగ్రహం! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం!

అఖిల భారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి

Select Suryaa Now
అఖిల భారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి

నెల్లికుదురు, మేజర్ న్యూస్, నవంబర్ 15 నుంచి 18 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కేంద్రమైన నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ అఖిలభారత మహాసభల సందర్భంగా 15న జరిగే రైతు బహిరంగ సభ ను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గునగంటి రాజన్న, జిల్లా కోశాధికారి ఆకుల రాజు పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ నుండి బహిరంగ సభ ప్రచార బండి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1.58 కోట్లకు పైగా సభ్యత్వంతో అఖిలభారత కిసాన్ సభ ప్రపంచంలోనే అతిపెద్ద రైతాంగ ఉద్యమ సంస్థగా కొనసాగుతోందని తెలిపారు. సామ్రాజ్యవాదం, భూస్వామ్యానికి వ్యతిరేకంగా సాగించిన చారిత్రాత్మక పోరాటాల వారసత్వాన్ని కొనసాగిస్తూ రైతాంగ హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందన్నారు.ఆ చారిత్రాత్మక పోరాటాల చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశవ్యాప్తంగా రైతులను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం అఖిలభారత కిసాన్ సభ అనునిత్యం అండగా నిలుస్తోందని వివరించారు.2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయిందని, వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమైందని పేర్కొన్నారు. మతం, కులం పేరుతో ప్రజలను విభజించే శక్తులకు బదులుగా జీవనోపాధి, భూమి, ఉపాధి, ఆహార భద్రత వంటి మౌలిక సమస్యలపై ప్రజలు సంఘటితం కావాలనిపిలుపునిచ్చారు. నవంబర్ 15 నుంచి 18 వరకు జరిగే 36వ అఖిలభారత మహాసభలకు దేశం నలుమూలల నుంచి 1000 మందికి పైగా ప్రతినిధులు, పరిశీలకులు, నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. నవంబర్ 15న లక్షలాది మంది రైతులతో భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభ జరగనుందని పేర్కొన్నారు.ఈ మహాసభలు రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగ భవిష్యత్తు, రైతుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై దేశవ్యాప్త చర్చకు కీలక వేదికగా నిలవనున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు రైతు సంఘం జిల్లా నాయకులు బొబ్బాల యాకుబ్ రేడ్డి, ఇసంపేల్లి సైదులు,పెరుమాండ్ల బాబుగౌడ్,తోటనర్సయ్య,బానాలయాకయ్య,తొటశ్రీను,అచ్చ నగేష్, బండవెంకన్న తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ :ప్రసాద్ ,నెల్లికుదురు, మహబూబాద్ జిల్లా