మాజీ సీఎం జగన్ ను కలిసిన వైస్సార్సీపీ కన్వీనర్ రవి రెడ్డి
తాడేపల్లిలోని క్యాంపు కార్యా లయంలో రాష్ట్ర మాజీముఖ్యమంత్రి, వైయస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.యస్.జగన్మోహన్ రెడ్డిని కదిరి నియోజకవర్గం లోని నల్లచెరువు మండల వైయస్సార్ సీపీ కన్వీనర్ రవికుమార్ రెడ్డి తన కుమార్తె మొండెం లిషిత రెడ్డి తో కలిసి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సంద ర్భంగా మండలంలో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యా చరణకుసంబంధించి పలు కీలక అంశాలపై అధినేత తో చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లే దిశగా వై.యస్. జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికవైయస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.