బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి పలువురు నేతలు!
• మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాయకులు
• ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో చేరికలు
సూర్య, బెజ్జూర్:
బీఆర్ఎస్ పార్టీకి పలువురు నాయకులు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
బెజ్జూర్ మండలానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ పర్వీన్ సుల్తానా, తెలంగాణ జావిద్, బెజ్జూర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు రామడుగుల రమేష్, తిరుమల స్వప్న ప్రభాకర్‌తో పాటు నాయకులు శ్యామల కిరణ్ కుమార్, కుట్రంగి భీమన్న, కావుడే సుగుణాకర్, మూస అరుణ్, తిరుపతి, రాజేష్ తదితరులు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని నాయకులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పెద్దసిద్ధపూర్ సర్పంచ్ సెండే పద్మ శంకర్, బెజ్జూర్ ఉపసర్పంచ్ రాచకొండ ఆదర్శ్, బెజ్జూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సామల రాజన్న తదితరులు పాల్గొన్నారు.